Yevarikosamamma

ఎవరికోసమమ్మ ఈ సిలువ త్యాగము

ఎవరికోసమమ్మ ఈ సిలువ త్యాగము
ఎవరికోసమయ్య ఈ ఘోర మరణము
నీకోసమేనమ్మ నాకోసమెనమ్మ
నీవు నేను చేసిన పాపం కోసమమ్మా… (2)

||ఎవరికోసమమ్మ||

సృష్టికి యజమానుడు పాకలోన పుట్టాడు
సర్వ సృష్టి రాక్షణకై హింసలెన్నో ఓర్చినాడు
స్తుతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో (2)
పలికినా మాటలలో ఎంత వేదనుంది చుడు (2)

||ఎవరికోసమమ్మ||

ఓర్వలేని చెడుగులు చెరనుబట్టిరా తండ్రిని
చెప్పరాని హింసలతో బాధపెట్టిరా
అయినా నాతండ్రి ప్రేమతో క్షమియించి (2)
తండ్రీ వీరు చేసేది క్షమియించమని పలికినడా (2)

||ఎవరికోసమమ్మ||

సిలువ పక్క గజదొంగ మాట విన్నడు
నాతోకూడ పరాదైసిలో ఉందువన్నడు
సిలువయొద్ద నిలుచున్న తల్లిని చూసి (2)
అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినడు (2)

||ఎవరికోసమమ్మ||

మధ్యాహ్నం వెలలోన చీకటిపడెను
ఆదేశమంత అర్ధరాత్రి చందమాయేను
మూడు గంటల సమయంలోనా
ఏలి ఏలి లామా సభక్త అని
నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విదిచావు అని పలికినడు

||ఎవరికోసమమ్మ||

సిలువలోన నా తండ్రి నోరెండి పోతుంది
దప్పిగొని యున్నానని దయతో నీళ్ళడిగినడు
చేదు చిరక స్పంజితో అదందించిరి తండ్రికి (2)
తాగలేక నా తండ్రి తల్లడిల్లి పోయినడు (2)

||ఎవరికోసమమ్మ||

దేవాలయపు తెర రెండుగా చిలగ
ఈ భూమిపైన బండలన్ని బ్రద్దలు కాగా
తండ్రీ సమాప్తమైనదని (2)
తలవంచి ఆత్మను అప్పగించెను (2)

||ఎవరికోసమమ్మ||

సమాధులు తెరువబడి అందరు లేచి
ఆశ్చర్య పరిచినరు ఈ లోకాన్ని
తండ్రీ నీ చేతులకు నా ఆత్మనప్పగితున్నా (2)
అని పలికి నా తండ్రి అమరుడాయే సిలువలో (2)

||ఎవరికోసమమ్మ||