Yennatharagani Nannu
ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావూ
ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావూ
ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా
ఎంతమంచి ప్రేమ చూపావు
॥ఎందుకింత ॥ఎన్న॥
1. పాపినైన నన్ను నీవు కనికంచినావు
నా పాపములన్నిటిని కడిగివేసినావు
పతనమైన నా జీవిత గతిని మార్చినావు
పనికిరాని నన్ను నీ పనికి నిలిపినావు
॥ఎందుకింత ॥ఎన్న॥
1. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు
పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు
దూతల కందని నీ దివ్యమైన సేవను
దుమ్ము ధూళినైన నన్ను చేయ నిచ్చినావు