Yenchithivaa Deva

ఎంచితివా దేవా నను

ఎంచితివా దేవా నను నమ్మకమైనవానిగా
నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా
నీ శుభవార్త చాటగా – నీ కార్యాలు చేయగా

॥ఎంచితివా ||

1. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరో ఉండగను
ఘనహీనుడను వెర్రివాడను నను ప్రేమించితివా
ఏమున్నదయ్యా నీ కొరకు నాలో
బలమునీదేను యేసయ్యా బలహీనుడను నేనయ్యా

॥ఎంచితివా ||

2. కఠిన శ్రమలు ఏ కలతలైనను నను ఎదిరింపగను
బెదరకుండ నీ పనిచేయుటకు నను స్థిరపరచితివా
సాక్ష్య జీవితం ఊపిరిగా నీదు మాటలే నా ప్రాణముగా
సాగిపోయెద యేసయ్యా కడదాకా నడిపించుమయా

॥ఎంచితివా ||