Yemivvagalanayya Neepremaku

ఏమివ్వగలనయ్య నీప్రేమకు

ఏమివ్వగలనయ్య నీప్రేమకు
ఏమివ్వగలనయ్య నిరుపేదనూ
నా కొరకు చేసిన త్యాగానికి
నా కొరకు చిందిన రక్తానికి

||ఏమివ్వగల||

1. విస్తార ధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా
పరలోక గగనాన భువనాల నేలేటి రారాజువు నీవెగా
రారాజువు నీవెగా… మా రాజువు నీవెగా

||ఏమివ్వగల||

2. నా పాపముల కొరకు నా శాపముల కొరకు
బలియైన నా యేసయ్యా
ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ
ప్రకటింతునూ నేనయ్యా ప్రకటింతునూ నేనయ్యా
ప్రకటించెదా యేసయ్యా

||ఏమివ్వగల||