Yelugetti Paadana
ఎలుగెత్తి పాడనా నీ స్తోత్రగీతం
ఎలుగెత్తి పాడనా నీ స్తోత్రగీతం
ఇలలోన చాటనా నీ దివ్య చరితం
పరిశుద్ధుడవు నీవని ఏ పాపం ఎరుగవనీ
మా పాపముల కోసమే వెలచెల్లించినావనీ
1. మంచివారు ఈ లోకంలో ఎందరు ఉన్నా
మచ్చలేని వారు ఎవరు కనరారయ్యా
ఎంత చూచినా కొంచెమైననూ దోషములేనివాడా
వంచన పాలై నలిగిన మదిలో నెమ్మది నొసగేవాడా
॥నీకే స్తోత్రము॥ ॥ఎలుగెత్తి ||
2. దేవుడనే పిలుపునకూ అర్హుడనీవే
శుద్ధుడనే పదానికీ అర్థం నీవే
వేల్పులలోనా నీవంటి వారు ఎవరూలేరు గదయ్యా
ఇలలో ఉన్న దేవతలంతా నీకే మ్రొక్కెదరయ్యా