Yelanti vaadavaina

ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా

ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా (2)

1. నీకు మేడ మిద్దెలున్నా-నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి-ప్రభునడిగి చూడమన్నా

||ఏలాంటి||

2. నీకు ధనము బలగమున్నా-నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే-దరికెవరు రారు సున్నా

||ఏలాంటి||

3. పాపుల కొరకు ప్రభువు-కలువరిగిరిపైన
ఆసిల్వవేసి దుర్మారులంత-బహుబాధ
పెట్టిరన్నా

||ఏలాంటి||

4. నీవు పాపరోగివయ్యా-ప్రభు
పిలుచుచున్నడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా-ఎరిగి నడువుమయ్యా

||ఏలాంటి||