Yeguruthunna Thellapaavuramole

ఎగురుతున్న తెల్లపావురమోలే

ఎగురుతున్న తెల్లపావురమోలే
సాగుతున్న సెలయేరుల ఓలే
కల్లలెరుగక కపటము తెలియక కదులుతున్న నా చెల్లెమ్మ
కడలి వంటి బాధ గుండెల్లోన దాచి కన్నీరైతివ చెల్లెమ్మ

1. దూరమాయెనే నీ కన్నోళ్ళు
కడుఘోర మాయెనే నీ కన్నీళ్ళు
ఆదుకోని వారమ్మా నీ అయినోళ్ళు
ఆడపిల్లవైనందుకు నీకు నిందలు

||ఎగురుతున్న||

2. దిక్కు ఎవ్వరు నాకు లేరనీ
దిగులు చెందకూ నా చెల్లెమ్మా
దీనుల కోసం యేసు నాధుడు
దినమెల్ల చేచాచి నిలిచాడమ్మా
దీనమైన నీ బ్రతుకును మార్చేనమ్మా

||ఎగురుతున్న||

3. నమ్మినవారే నయవంచకులై
నడివీధిలో వినుత్రోసినా
నమ్మదగినవాడు నా యేసుడు
నిన్ను చేరదీసీ నిలిపేనమ్మా
నిజమైన ప్రేమ నీకు చూపేనమ్మా

||ఎగురుతున్న||