Ye Yogyatha Leni Daananu
ఏ యోగ్యతా లేని దానను (లేని వాడను)
ఏ యోగ్యతా లేని దానను (లేని వాడను)
నీ ప్రేమతో ఆదరించుమా
లోకమనే ఎడారిలో ఎండమావిని
పాపమనే (శోకమనే) నిశీధిలో నిలిచియుంటిని
||ఏ యోగ్యత॥
1. ఆకులు రాలి ఫలము లేని
ఎండిన మోడునై నేను ఉంటిని
ఎవరికి గాకా ఏ దరి లేక
వ్యర్థముగా ఇలలో బ్రతుకుచుంటిని
ఆర్తధ్వని ఆలకించవా
తండ్రి నన్నాదరించవా
||ఏ యోగ్యత॥
2. హోరునవీచే పెనుగాలైనా
ఆగిపోవును నీ మాటతో
హృదయవేదన తొలగిపోవును
నెమ్మది కలిగించె నీ ఆత్మతో
ఆర్తధ్వని ఆలకించవా తండ్రీ నన్నాదరించవా