Virigi Naligina Manassu
విరిగి నలిగిన మనస్సు
విరిగి నలిగిన మనస్సు – ఎంతో ఇష్టమని
వినయము గలిగిన హృదయం – ఎంతో శ్రేష్ఠమని
పలికిన వాడు నా దేవుడు – ఎంతో సాత్వికుడు
తెలిసినవాడు నా యేసుడు – అతడు పూజార్హుడు
||తెలిసిన||
1. విరిగిన నలిగిన యాకోబు – ఇశ్రాయేలుగా మారెనని
వినయ మనస్కుడు యోసేపు – అన్యదేశమును ఏలెనని
||తెలిసిన||
2. విరిగి నలిగిన మనసులదే – దేవుని ఉన్నత రాజ్యమని
వినయము గలిగిన హృదయాలే దేవుని ఘనతను పొందునని
||తెలిసిన||
3. విరిగిన నలిగిన దావీదు – దేవుని దీవెన పొందెనని
వినయ శీలి ఆ హనోకు మరణము చూడక పోయెనని