Vinnapaalu Aalakinchuma
విన్నపాలు ఆలకించుమా
విన్నపాలు ఆలకించుమా
నా విజ్ఞాపనకూ చెవినీయుమా
విడుదలకోరి నిను వేడుచున్నాను
నీ సన్నిధిలో సాగిలపడియున్నాను
||విన్నపాలు||
1. రాజులకు రారాజు మమ్మేలే మారాజు
భూపతలకు అధిపతివి నీవేనయ్యా
నీకు సాధ్యము కానిదిలేదు
నిన్ను మించిన పెన్నిధిలేదు
||విన్నపాలు||
2. బలవంతుడవు నీవు
బహుపూజనీయుడవు
బలమైన కార్యాలు చేసే నా దేవుడవు
బలహీనతలు తొలగించెదవు
నీ బలము చూపించెదవు