Vendi Bangaaramulu
వెండి బంగారములు నాకు వలదు
వెండి బంగారములు నాకు వలదు – పేరు ప్రఖ్యాతలు నాకు వలదు (2)
ఇహభోగ భాగ్యాలు నాకు వలదు (2)
సిరిసంపదల ఆశ నాకు లేదు (2)
నీ పాద సన్నిధే నాకు చాలు (2)
స్తుతి నీకే నా ప్రభూ (2)
స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభూ (2)
స్తుతి నీకే నా ప్రభూ (2)
1. కమ్మని విందులు నాకు వలదు – క్షణిక ఆనందాలు నాకు వలదు (2)
కీర్తీ కిరీటాలు నాకు వలదు (2)
కలల సంచారాలు నాకు వలదు (2)
నీ దివ్య కౌగిలే నాకు చాలు (2)
|| స్తుతి నీకే ||
2.బంధు బాందవ్యాల బాధ వలదు – బరువు భాధ్యతలన్న భయము వలదు (2)
నీ మధుర బంధమే నాకు చాలు (2)
నీవిచ్చు భాగ్యమే నాకు మేలు
నువు మెచ్చు కార్యమే నాకు చాలు
నువు హెచ్చు కార్యమే నాకు చాలు