Uhinchaledayya Ee Jeevitham
ఊహించలేదయ్యా ఈ జీవితం
ఊహించలేదయ్యా ఈ జీవితం
వర్ణింపలేనయ్యా ఈ భాగ్యము
తులువనైన నాకూ – ఇంత విలువ కలిగేనని
కూలిరాలి పోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని
1. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా
మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు
పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా
నన్ను పలుకరించగా పరితపిస్తూఉంటావు
కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు.
చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు
॥ఊహించ||
2. అపరాధిని నను ప్రేమించి – ఆసక్తితో నను పిలిచి
నీ దివ్య రక్తముతో – నిలువెల్ల కడిగావు
అగ్ని బిలముకై పరుగెత్తె నా అడుగులనే గమనించి
ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు
నీ జీవగ్రంధములోన నా పేరు వ్రాశావు
నీతిపరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు