Thandri Deva Thandri Deva

తండ్రి దేవా తండ్రి దేవా

తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా – నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ (2)

1. నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)

2.నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమాయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)