Thadimi Chusthe Yeshavu
తడిమి చూస్తే ఏశావు
తడిమి చూస్తే ఏశావు స్వరము వింటే యాకోబు (2)
నిన్ను తడిమి చూస్తే అన్యుడవు నీ స్వరము వింటే క్రైస్తవుండవు
వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవ
||తడిమి చూస్తే ||
సున్నము కొట్టిన సమాదిలా ఉంటివా
పై తెలుపే గానీ లోపలంతా కుల్లు (2)
నీ బ్రతుకంతా అలాగున్నదా ఆచారాలకు బానిసైతివా (2)
ఆచారాలకు బానిసైతివా
||తడిమి చూస్తే ||
ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు
పైకి పచ్చని దాని ఫలము శూన్యము (2) ఆఆ
నీవు కూడా అలాగుంటివా ఆత్మ ఫలమును కాయకుంటివా (2)
ఆత్మ ఫలమును కాయకుంటివా
||తడిమి చూస్తే ||
ఎన్నాళ్ళు వేషధారిగుందువూ ఎన్ని నాల్లు క్రీస్తును శిలువ వేయుదువు (2)
నేడే రక్షణ దినమని ఎరుగుమా నేడే క్రీస్తుని వెంబడించుమా (2)
నేడే క్రీస్తుని వెంబడించుమా