Sthuthiyinthumu Sthothrinthumu

స్తుతియింతుము స్తోత్రింతుము

స్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని (2)

|| స్తుతియింతుము ||

నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును

|| స్తుతియింతుము ||

మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి (2)
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా

|| స్తుతియింతుము ||

పరిశుద్ధ జనముగా
నిర్దోష ప్రజలనుగా (2)
పరలోక తనయులుగా
పరమ కృపతో మార్చిన దేవా

|| స్తుతియింతుము ||