Sthuthi Paadanaa Nenu

స్తుతి పాడనా నేను

స్తుతి పాడనా నేను
నన్ను కాచే యేసయ్యా
నా జీవాన్నదాతకు
నను నడిపే ప్రభువుకు

పాపములో పడియున్న వేళ
వదలకనే దరి చేర్చిన దాత
నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా

|| స్తుతి ||

సోలిపోయి తూలుతున్న వేళ
జాలితో నను పిలచిన నా దేవా
నా హృదయ ధ్యానము నీకే అర్పింతును

|| స్తుతి ||

భూమినేలే రారాజు నీవని
ధరణిలోని నీ మహిమను ప్రకటించ
నీ రెక్కల చాటున నను దాచే నీడవని

|| స్తుతి ||