Srama Dinamuna neevu
శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక
శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదువు
శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రచౌదవు
శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు
శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు
॥శ్రమ॥
1. ప్రసవవేదన శ్రమ అనుకుంటే – అమ్మ మనకు జన్మ నిచ్చునా..
బంధాలన్నీ భ్రమ అనుకుంటే – ఊడిగాలు మనకు చెయ్యునా..
బాధలు ఎన్నైన బ్రతుకు ఇవ్వాలని
కోరికోరి శ్రమ పొందిన అమ్మను చూడు – ఆమె తెగువను చూడు
॥శ్రమ॥
2. పండు తెంపితే బాధ అనుకుంటే – చెట్టు మనకు ఫలమునిచ్చునా….
కరుగుట నాకు శ్రమ అనుకుంటే క్రొవ్వొత్తియే వెలుగునిచ్చునా
నీ చుట్టూ నిలిచియున్న లోకము చూడు
శ్రమ పొందనిదేమున్నదో తెలుపుము నాకు
నువ్వు తెలుపుము నాకు
శ్రమ పొందక ఎవరుండునో తెలుపుము నాకు
నువ్వు తెలుపుము నాకు
॥శ్రమ॥
3. పాపుల భారం శ్రమ అనుకుంటే – మన యేసుడు మహిమ వీడునా…
దోషుల శిక్ష మోయ బాధనుకుంటే – సిలువ మోయ సిద్ధమౌవ్వునా…
ప్రాణము పెట్టిన ప్రజను కాయాలని
నెత్తుటి ముద్దగ మారిన యేసును చూడు – ఆ త్యాగము చూడు