Simhasanudu Mahima

సింహాసనసీనుడు మహిమ

సింహాసనసీనుడు మహిమ సామ్రాజ్య నాయకుడు
పరిశుద్దులందరిని దర్శింపగ ప్రియమార కౌగీట నన్ను చేర్చగా (2)
అందుకోసమే ఈ ప్రయాస ఆదిచూడాలనే నా మది ఆశ
ఆశల పురమైన యేసులో

రారాజు యేసు మహిమ లో నిలచి
నూతన పేరుతో నన్ను పిలచి (2)
నమ్మకమైన దాసుడనచు (2)
యేసు హర్శించగా ఆనంద సిరులు రాలగా (2)
అందుకోసమే ఈ ప్రయాస ఆదిచూడాలనే నా మది ఆశ
ఆశల పురమైన యేసులో

||సింహాసనసీనుడు ||

యాత్ర ముగియగనే తేజోవాసులచే
తండ్రీ ఇంటికి నను కొనిపోగా (2)
పరిశుద్దులందరు పలుకరించి (2)
ప్రేమ పంచగా కృప విలువ తెలియుగ (2)

అందుకోసమే ఈ ప్రయాస ఆదిచూడాలనే నా మది ఆశ
ఆశల పురమైన యేసులో

||సింహాసనసీనుడు ||

శిక్షణ కొరకు ధరణిన జనించి
ఫలితము పొంద పరముకు వెళ్లగా (2)
ముళ్లకు ప్రతిగా మకుటము నిచ్చి(2)
మహిమ పొందగ నా కలలు పండునుగా
యేసుని మహిమ పొందగ నా కలలు పండునుగా
అందుకోసమే ఈ ప్రయాస ఆదిచూడాలనే నా మది ఆశ
ఆశల పురమైన యేసులో

||సింహాసనసీనుడు ||