Simhasanaaseenudu

సింహాసనాసీనుడు - మహిమ సామ్రాజ్య

సింహాసనాసీనుడు – మహిమ సామ్రాజ్య నాయకుడు
పరిశుద్ధులందరిని దర్శింపగా
ప్రియమార కౌగిట నను చేర్చగా
అందుకోసమే ఈ ప్రయాస – అది చూడాలని నామది ఆశ
ఆశల పురమైన యేసులో

1. రారాజు యేసు మహిమలో నిలిచి
నూతన పేరుతో నన్ను పిలిచి
నమ్మకమైన దాసుడనుచు
యేసు హర్షించగా – ఆనంద సిరులు – రాలుగా

||అందుకోసమే||

2. యాత్ర ముగియగానే – తేజోవాసులచే
తండ్రి ఇంటికి నను కొనిపోగా
పరిశుద్ధులందరు పలుకరించి
ప్రేమపంచగా – కృప విలువ తెలియుగా

||అందుకోసమే||

3. శిక్షణ కొరకు ధరణినా జనించి
ఫలితము పొంద పరముకు వెళ్ళగా
ముళ్ళకు ప్రతిగా మకుటము నిచ్చి
(యేసుని) మహిమ పొందగ – నాకలలు పండునుగా

||అందుకోసమే||