Simhapu Pillalu Lemigalavai
సింహపు పిల్లలు లేమిగలవై
సింహపు పిల్లలు లేమిగలవై – ఆకలిగొనునేమో గానీ
నిన్నాశ్రయించిన ఈ నాబ్రతుకులొ- ఏమేలు కొదువలేదయ్యా నా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
|| సింహపు ||
1. పిలిసితే పలికేవు అడిగితె ఇచ్చేవు – అలసిన నా బ్రతుకును ఆనంద పరిచేవు
నీ మాట వజ్రాల మూట నా యేసయ్య – నా బ్రతుకు ద్రాక్షల తోట
|| సింహపు ||
2. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్య – నిత్యము తోడుండి నడిపించేవయ్య
జీవజలముల వూట యేసయ్య – నీవేనా బంగారుకోట
|| సింహపు ||
3. శక్తి హినులకు బలాబివృద్ది చేసి – సొమ్మసిల్లు ప్రాణమును నీ శక్తి తో నింపి
నీ పలుకు తేనెల ఊట యేసయ్య – నీ బాట వెన్నెల బాట
|| సింహపు ||
4. విరిగిన నా హృదయం నీకే బలియాగం – నలిగిన నా ఆత్మే సర్వంగాహోమం
నీవే నా ఆశ్రయకోట యేసయ్య – ఆశీర్వదపు ఊట