Shramalandu Neevu
శ్రమలందు నీవు నలిగే సమయమున
శ్రమలందు నీవు నలిగే సమయమున
ప్రభు నీకు తోడుండునని
యోచించలేదా? గమనించలేదా?
ఇమ్మానుయేలుండునని
||శ్రమలందు||
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత
ఆహారము పంపించ లేదా? (2)
ఈనాడు నీకు జీవాహారముతో
నీ ఆకలి తీర్చుట లేదా? (2)
||శ్రమలందు||
శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి
రాజ్యాధికారమీయలేదా? (2)
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి
పరలోక రాజ్యమీయలేదా? (2)