Shaashvatha shobhaathishayamaina
శాశ్వత శోభాతిశయమైన దీవెనలు
శాశ్వత శోభాతిశయమైన దీవెనలు దయచేసిన
నిత్య సంతోషమయమైన కృపనెంతో
మా పైన కురిపించినావు (2)
ఊహకు మించిన ప్రేమను పంచిన (2)
నిజ స్నేహితుడనీవయ్యా (2)
నీ ప్రేమకు సాటెవరు రానే రారయ్యా
నీ తోటి సములెవరు లేరు యేసయ్యా (2)
॥శాశ్వత||
1. లెమ్ము తేజరిల్లుము నా మహిమ
మీ పైననే ఉదయింపచేతనంటివే (2)
ఇచ్చిన మాటను నెరవేర్చే మహనీయుడవు నీవేగా (2)
౹౹నీ ప్రేమకు౹౹
2.చూడు గమనించు నిన్ను నా చేతిలోనే రూపించినానంటివే (2)
నీ పని కొరకై నియమించి దీవించేది నీవేగా (2)
౹౹నీ ప్రేమకు౹౹
3. నిన్ను స్వస్థపరచి విడుదలనందించే యెహోవాను నేనంటివే (2)
ఏ బలహీనతలోనైనా విడిపించేది నీవేగా (2)