Sannuthinthumo Prabho..

సన్నుతింతుమో ప్రభో

సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో (2)

కన్న తండ్రి కావుమా (2)
కలుషము నెడబాపుమా

||సన్నుతింతుమో||

నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా (2)

పాతక జన రక్షకా (2)
పతిత పావన నామకా

||సన్నుతింతుమో||

మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా (2)

దేవా మానవ నందనా (2)
దివ్య సుగుణ మందనా

||సన్నుతింతుమో||

ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా (2)

కామిత ఫలదాయక (2)
స్వామి యేసు నాయక

||సన్నుతింతుమో||

పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో (2)

నీ పవిత్ర నామమున్ (2)
నిరతము స్మరియించెదన్

||సన్నుతింతుమో||