Sakalasirvadamula Karanabhutuda

సకలాశీర్వాదముల కారణభూతుడా

సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా (2)
నీ మేలుల తలంచుచుండ
స్తుతిగానమే పెదవుల నిండా (2)

జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా (2)

||సకలాశీర్వదముల||

1. అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా (2)
ఆరోగ్యములను కుదుటపరచి (2)
ఆయుష్షు పెంచేవాడా

జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా (2)

||సకలాశీర్వదముల||

2. జీవమార్గం తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా (2)
ఆటంకములను అనువుపరచి (2)
ఆకాంక్ష తీర్చేవాడా
(జయశీలుడా…)

3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా (2)
ఆదాయములను పదిలపరచి (2)
ఆధిక్యమిచ్చేవాడా
(జయశీలుడా…)