Rajula Raja
రాజుల రాజా రాజాది రాజా
రాజుల రాజా రాజాది రాజా
శతకోటి సూర్య తేజోప్రభా
అసాధ్యమైన కార్యములు
తలవంచుచున్నవి ఈ పరిచర్యలో
సాధ్యపరచు నీ పాదాల ఎదుట ( 2 )
|| రాజుల రాజా||
వేలకొలది శత్రువులను ఇస్సాకు ఎదుట
నేల వరకు వంచితివి పరాక్రమశాలివై ( 2 )
పరదేసియైన నన్ను ప్రేమతో పిలచి
దృఢపరచుచుంటివి ఈ తరము ఎదుట ( 2 )
|| రాజుల రాజా||
గుమిగూడిన శత్రువులను ఏలీషా ఎదుట
అంధులను చేసితివి అగ్ని స్వరూపివై ( 2 )
బలహీనుడైన నన్ను బలముతో నింపి
బలపరచుచుంటివి నా శత్రువుల ఎదుట ( 2 )
|| రాజుల రాజా||
దాస్యము చేయుచుంటిని పాపము ఎదుట
పలుమార్లు పడితిని పరిశుద్ధత నుండి ( 2 )
ఉన్నత దర్శనముతో నాపై కృప చూపి
వాడుకొనుచున్నావు నీ సువార్త రధముగా ( 2 )