Priyuda Yesayya
ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
ఏ తల్లి తండ్రి చూపని ప్రేమా చూపేవయ్యా
ఏ బంధువులున్నా నీతో ఎవరు సరిరారయ్యా
1. ఇహలోకంలో సుఖబోగాలు అక్కరలేదయ్యా
నీ సన్నిధిలో నా నిత్యము నిలిచే ధన్యత చాలయ్య
ఆ ధన్యత చాలయ్య
యేసయ్యా నా ప్రియుడా యేసయ్యా నా ప్రియుడా…
||ప్రియుడా||
2. ధనధాన్యాలు మేడ మిద్దెలు అక్కరలేదయ్యా
నీ పాదము చెంత స్థలము దొరికితే అది పదికోట్లయ్యా
ఆ స్థలమే ఘనమయ్యా
॥యేసయ్యా నాప్రియుడా||
3. కష్టములైనా నష్టములైనా భయమే లేదయ్యా
ఎన్నడు నన్ను చేయి విడువని తోడే చాలయ్యా
నీ తోడే చాలయ్యా