Premante Prema
ప్రేమంటే ప్రేమ యేసయ్య ప్రేమ
ప్రేమంటే ప్రేమ యేసయ్య ప్రేమ
లోకాన దొరకనిదా ప్రేమ
జ్ఞానాని కందని తండ్రి ప్రేమ
॥ప్రేమంటే॥
1. సొగసు చూచి వలచేనమ్మ
ఈలోక యవ్వన ప్రేమ
కురూపినైనా వికారినైనా
అక్కున చేర్చును యేసయ్య ప్రేమ
॥ప్రేమంటే॥
2. ఉన్నత స్థితిలో ఉంటే నిన్ను
పలుకరించేను బంధు ప్రేమ
హీనస్థితిలో దీనస్థితిలో
విడువక నిలిచేను యేసయ్య ప్రేమ