Premake Swaagatham

ప్రేమకే స్వాగతం పరమాత్మకే స్వాగతం

ప్రేమకే స్వాగతం – పరమాత్మకే స్వాగతం
మహిమ కాంతి సుగుణాల శాంతి నా యేసుకే స్వాగతం – నా ప్రియునికే స్వాగతం (2)

|| ప్రేమకే స్వాగతం ||

1.కరుణకే స్వాగతం – కరుణాత్మకే స్వాగతం
కరుణ అరుణాల కోటివర్ణాల నీతికే స్వాగతం – నా రాజుకే స్వాగతం (2)

|| ప్రేమకే స్వాగతం ||

2.సమతకే స్వాగతం – నిజ మమతకే స్వాగతం
సకలభాగ్యాల సప్తనేత్రాల స్వామికే స్వాగతం – నీ ప్రేమకే స్వాగతం (2)

|| ప్రేమకే స్వాగతం ||

3.క్రీస్తుకే స్వాగతం – నా యేసుకే స్వాగతం
సత్యమార్గాల జీవవాక్యాల కర్తకే స్వాగతం – నా జ్ఞానికే స్వాగతం (2)

|| ప్రేమకే స్వాగతం ||

4.అగ్నికే స్వాగతం – దైవాగ్నికే స్వాగతం
పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం – ఘనకీర్తి కే స్వాగతం (2)

|| ప్రేమకే స్వాగతం ||