Prabhuva Nee Krupa
ప్రభువా నీ కృప తలంచుచు
ప్రభువా నీ కృప తలంచుచు నే జీవింతును
నా జీవిత కాలమంతా నిన్నే ఘనపరుతును (2)
దేవా నీ ప్రాణ త్యాగము ధ్యానించుచు (2)
ప్రకటింతు నాలో ప్రాణము ఉన్నంతవరకు (2)
||ప్రభువా నీ కృప||
తడిపెను నా హృదయ సీమను.. నీ వాక్యపు జల్లులో..
కురిసెను నీ కృపా ఎల్మొను మంచు వలే.. (2)
విరభూసె నాలో ఫలములు నిండుగా..
హర్షించె నా హృదయం ఆనంద గానమై.. (2)
||ప్రభువా నీ కృప||
నా గిన్నె నిండి పొర్లేను నీ సమృద్ది దేవెనతో..
ప్రవహించే నీ ఆత్మా.. జీవ నదివలెను..(2)
మొడైన బ్రతుకు చిగురించే నీలోనే..
నిట్టూర్పులే నాలో.. స్తుతిగీతమాయేను…
||ప్రభువా నీ కృప||
నా హృదయ క్షేత్రమందు కొలువైన యేసయ్యా..
విరజిమ్మే నాలోనా.. నీ ఆరని కాంతులు..(2)
ఎద నిండె నాలో ఆత్మీయ తలపులతో…
పులకించి నా హృదయం స్తుతి చేసి పాడేను.. (2)