Prabhuva hithavastharam

ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యా

ప్రభువా హితవత్సరం – మాకు ఇచ్చావయ్యా
విడుదల సంవత్సరంగా ప్రకటించియున్నావయ్యా
నిను విడువనని – యెడబాయనని
ఆశీర్వదించావయ్యా – హల్లెలూయా

1. లోకమంతటిని ముంచెత్తిన – తెగులు చేతిలో పడనీయక
పనిపాటులేవి లేకున్నను – కరువనేది రానీయక
అనుకూల స్థితిలో తిను దాని కంటే
ప్రతికూల స్థితిలో సమృద్ధినిచ్చావు
నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య

॥ప్రభువా॥

2. అవరోధమెంతో ఎదురైనను – ఆగకుండ నీ
పరిచర్యను ఆశ్చర్యరీతిలో జరిగించావు –
అధిక మహిమను చూపించావు
తండ్రీ నీ సన్నిధికి దూరమైన
దయజూపి నను నీ దరి జేర్చినావు
నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య

॥ప్రభువా॥