Prabhu Yesuni

ప్రభు యేసుని పూజించెదం

ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం (2)
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2)
సంతోషముగా ఉండెదం (4)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

|| ప్రభు ||

జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు (2)
మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2)

||హల్లెలూయా||

ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి (2)
ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2)

||హల్లెలూయా||