Prabalamugane
ప్రబలముగనే ప్రస్తుతించెద
ప్రబలముగనే – ప్రస్తుతించెద – ప్రభుని కృపలన్ని = ప్రతి దినము నిను – ప్రచుర పరచెద – ప్రభుడ నావిభుడా
||ప్రబల||
1. పొందుగోరి నా – యందు నిలిచిన – బంధు మిత్రుడవు = మందమతి కా – నంద మొసగిన – మహిమ తేజుడవు
||ప్రబల||
2. చింతదీర్చి – నా భ్రాంతి మార్చితి – వెంత వింతదియో = స్వాంతమున కడు – శాంతి గూర్చితి వెంత కరుణదియో
||ప్రబల||
3. నీతి కరపిన – జాతి మరపిన – ఖ్యాతి యేసునిదే = నీరసుడ నను – గారవించిన – నీతిరాజితడే
||ప్రబల||
4. జీవమిచ్చిన – జానవచ్చిన – దేవసుత నీవే = జీవదాయక – బ్రోవరా యిక – జాల మేలనురా
||ప్రబల||
5. నిమిష నిమిషము – నిను భజించెద – నెమ్మణంబునను = శమదమాది – సుగుణశోభిత – సమ్మదిని నిమ్మా