Praardhana Shakthi Naaku Kaavaalayyaa

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)

యేసయ్యా కావాలయ్యా

నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)

|| ప్రార్థన ||

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి

నేను ప్రార్థింపగ దయచేయుమా (2)

ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)

నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)

|| ప్రార్థన ||

సింహాల గుహలోని దానియేలు శక్తి

ఈ లోకంలో నాకు కావలయ్యా (2)

నీతో నడిచే వరమీయుమా (2)

నీ సిలువను మోసే కృపనీయుమా (2)

|| ప్రార్థన ||

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి

నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)

చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)

ఈ చిన్న వాడిని అభిషేకించు (2)

|| ప్రార్థన ||