Praaneshwara Prabhu

ప్రాణేశ్వర ప్రభు దైవకుమార

ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

ప్రణుతింతును నిన్నే- ఆశతీర

||ప్రాణేశ్వర||

నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)

నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2)

||ప్రాణేశ్వర||

మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)

నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2)

||ప్రాణేశ్వర||

పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)

నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2)

||ప్రాణేశ్వర||

నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)

జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2)

||ప్రాణేశ్వర||

కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)

కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2)

||ప్రాణేశ్వర||