Paradheshi o paradeshi

పరదేశీ.....ఓ పరదేశీ....

పరదేశీ…..ఓ పరదేశీ….
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే

ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము (4)

1. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా (2)
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా…..
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా…

|| ఏనాటి ||

2. ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా (2)
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా

|| ఏనాటి ||

3. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న (2)
విద్యావేత్తవైనా…తత్వవేత్తవైనా… ఎంతటి శాస్త్రవేత్తవైనా…
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా

|| ఏనాటి ||