Paapamerugani Paavanaathmuni

పాపమెరుగని పావనాత్ముని

పాపమెరుగని పావనాత్ముని
పరిహసించుట న్యాయమా (2)
దోషమెరుగని దీన బాంధుని (2)
దోషి చేయుట ధర్మమా – ధర్మమా

||పాపమెరుగని||

మోయరాని పాప భారము
మోపినారు సిలువపై (2)
గాయమొంది బాధకోర్చి వేదననొంది
ప్రాణమిచ్చుట నేరమా (2) నేరమా

||పాపమెరుగని||

జీవ జలముల త్రోవ చూపి
బ్రోవ నాత్మల దాహమొందె (2)
చావొంది ఆగమై బలి దానమై
జీవమిచ్చుట ఘోరమా (2) ఘోరమా

||పాపమెరుగని||