Paadave Koyila
పాడవే కోయిలా సుమధురా
పాడవే కోయిలా – సుమధురా సువార్త గీతికా
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లేలూయా – హల్లేలూయా స్తోత్రమని
||పాడవే ||
1. మహిమలో వెలిగేటి మారాజు
మాకై మహిమవీడి వచ్చాడని
సర్వము నేలేటి రారాజు
మాకై నిరుపేద అయినాడని
మా పాపభారాన్ని యేసే మోశాడని
ఆ ప్రేమ కిలలోన యేది సాటిరాదని
పాడవే పాడవే పాడవే కోయిలా
||పరిశుద్ధ||పాడవే ||
2. మిడిమిడి జ్ఞానంతో మానవులు
చీకటి దారులను వెతికేరని
అంతా తెలుసన్న మోసములో
అర్ధంలేని బ్రతుకు గడిపేరని
యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని
ఇకనైనా నిజము నెరిగి మనసు మార్చుకోమని
పాడవే పాడవే పాడవే కోయిలా