Oka kanniti katha
ఒక కన్నీటి కథ చెప్పనా
ఒక కన్నీటి కథ చెప్పనా
అది కథ కాదు నిజమే సుమా (2)
నేమోయలేని నా పాప భారం
నీడల్లే బ్రతుకంతా వెంటాడగా (2)
తన ప్రాణమే నా దోషములకు
పరిహారముగా హెచ్చించి
సిలువ శిక్ష మోసి నన్ను విడిపించి కాపాడి
తన రక్త దానముతో ఇలలోన కలిగించే నవజీవనం
||ఒక||
తన గాయములనే భరియించి
స్వస్థతనే మనకెల్లా కలిగించి (2)
ప్రియ శిష్యుడే విడనాడగా ఆ వెన్నుపోటునే సహించి
క్షమించమని ప్రార్థించగా మన ప్రియ రక్షకుడు
ఆ కరుణామయుడు కన్నా మించిన దైవం వున్నదా