O Nanno Ninne Aaradhinthunu
ఓ నాన్నో నిన్నే ఆరాధింతును
ఓ నాన్నో నిన్నే ఆరాధింతును
యేసయ్యా నిన్నే ఆరాధింతును
1. లోకము వద్దయ్యా – దాని ఆశలు వద్దయ్యా
నీవే చాలయ్యా – నీ సన్నిధి చాలయ్యా (2)
2. ఎవ్వరు లేరయ్యా – నాకున్నది నీవయ్యా
ఈ ఆశల లోకంలో – నా ధ్యాస నీవయ్యా (2)
3. మేడలు వద్దయ్యా – నాకు మిద్దెలు వద్దయ్యా
నీవే చాలయ్యా – నీ దీవెన చాలయ్యా (2)
4. ధనము వద్దయ్యా – నాకు ధాన్యము వద్దయ్యా
నీ మాటలు చాలయ్యా – నీ వాక్యం చాలయ్యా
5. అమ్మవు నీవయ్యా – నా నాన్నవు నీవయ్యా
తోడు నీవయ్యా – నా నీడ నీవయ్యా (2)
6. మరువబోకయ్యా నను – మరువబోకయ్యా
బ్రతుకలేనయ్యా ఈ మాయా లోకంలో (2)
7. ఎప్పుడు వస్తావు – నీ రాకడ ఏ సమయం
వేచియున్నాను – కనిపెట్టుచున్నాను (2)