Nyaayaadhipathiyaina

న్యాయాధిపతియైన దేవుడు నిన్ను పిలిచే

న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన

ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)

ఒక గుంపేమో పరలోకపు గుంపు

రక్షింపబడిన వారికే అది సొంతం

మరు గుంపేమో ఘోర నరకపు గుంపు

నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం

||న్యాయాధిపతి||

నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది

కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది (2)

కలువరిలో తన ప్రాణం పెట్టిన

యేసయ్యే నీ ప్రాణ రక్షణ

సిలువలో క్రయ ధనమే చెల్లించిన

ఆ ప్రభువే నీ పాప విమోచన

||ఒక గుంపేమో||

ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు

ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు (2)

మేఘముపై రానైయున్నాడుగా

త్వరలోనే నిను కొనిపోడానికి

వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా

నీ హృదిలో స్వీకరించడానికి

||ఒక గుంపేమో||