Nyaayaadhipathi Aina Devudu

న్యాయాధిపతి అయిన దేవుడు

న్యాయాధిపతి అయిన దేవుడు

నిను తీర్పు తీర్చేటి వేళలో

ఏ గుంపులో నీవుందువో

యోచించుకో ఓ మానవా (2)

||న్యాయాధిపతి||

ఆకలితో అలమటించగా

దాహముతో తపియించగా (2)

రోగముతో కృశియించగా (2)

నను చేర్చుకొనలేదు నీవెందుకు

అని యేసు నిన్నడిగిన ఏమందువు (2)

||న్యాయాధిపతి||

గ్రహియించుకో నీదు గమ్యము

విడనాడు పాప గతమును (2)

లేదింక నీకు తరుణము (2)

ప్రభునాశ్రయించుటే బహు క్షేమము

ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2)

||న్యాయాధిపతి||