Noothana geethamu ne paadedhaa

నూతన గీతము నే పాడెదా

నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతో
సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే

కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను

|| నూతన గీతము ||

కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ

|| నూతన గీతము ||

మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ

|| నూతన గీతము ||