Ninnu Ye Maatramu
నిన్ను ఏ మాత్రము విడువనని
నిన్ను ఏ మాత్రము విడువనని
ఎన్నడు నిను ఎడబాయనని
మాట యిచ్చినా మంచిదేవుడు నిన్ను మరచిపోతాడా
ప్రాణమిచ్చినా ప్రేమ రూపుడు – నిన్ను విడచిపోతాడా
1. సింహపు పిల్లలైన లేమిగలవై – ఆకలిగొనునేమో గానీ
యెహోవాను ఆశ్రయించు వారికి – ఏ మేలు కొదువై యుండదనీ
మాటయిచ్చినా మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా
ప్రాణమిచ్చినా ప్రేమరూపుడు – నిన్ను విడచిపోతాడా
॥నిన్ను ॥
2. అగ్నిలో నీవు నడచి వెళ్ళినా – జ్వాలలు నిన్ను కాల్చలేవని
అంధకారలోయలో పయనించినా – నీ ముందర వెలుగై నేనున్నాననీ
మాటయిచ్చినా మంచిదేవుడు నిన్ను మరచిపోతాడా
ప్రాణమిచ్చినా ప్రేమరూపుడు – నిన్ను విడచిపోతాడా