Ninnu Vembadincheda

పాపాంధకారం లో నుండి

నిన్ను వెంబడించెద
నీ కాడి మోయుదున్
నీదు పాదముల చెంత
నే నేర్చుకొందును (2)
మాదిరి నీవే – నెమ్మది నీవే
దీనుడవు యేసయ్యా (2)

||నిన్ను||

పాపాంధకారం లో నుండి
రక్షించి వెలిగించితివి (2)
పరిశుద్ధమైన పిలుపుతో
నీ వెంబడి రమ్మంటివి (2)
నీ వెంబడి రమ్మంటివి

||నిన్ను||

లోకాశలన్ని నీ కోసం
నేనింక ఆశించను (2)
లోపంబులేని ప్రేమతో
నీ కోసం జీవింతును (2)
నీ కోసం జీవింతును

||నిన్ను||

పవిత్రపరచుకొందును
అర్పించు కొందును (2)
కష్టాలు శ్రమలు రేగినా
నిను వీడిపోనయ్యా (2)
నిను వీడిపోనయ్యా

||నిన్ను||

ప్రేమ సువార్త ప్రకటింప
భారంబు మోపితివి (2)
సత్యమార్గంబు చాటగ
పంపుము నా ప్రభువా (2)
పంపుము నా ప్రభువా

||నిన్ను||