Ninnu Kaapaadu Devudu

నిన్ను కాపాడు దేవుడు

నిన్ను కాపాడు దేవుడు
కునుకడు నిదురపోడు – నిదురపోడు
వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు (2)
ఆదరించు యేసు దేవుడు ఉండగా

||నిన్ను కాపాడు||

శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా (2)
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
కాపాడు గొప్ప దేవుడు ఉండగా

||నిన్ను కాపాడు||

రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)
భయమేల నీకు – దిగులేల నీకు (2)
స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా

||నిన్ను కాపాడు||