Ninnu Chudaalani Yesayya
నిన్ను చూడాలని యేసయ్య
నిన్ను చూడాలని యేసయ్య
నిన్ను చేరాలని నాకు ఆశయ్య
నీతో ఉండాలని కోరిక
నీలా ఉండాలనే తలంపు
నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే గానమే
|| నిన్ను చూడాలని||
ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము
చూడాలని (2)
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్య
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ (2)
|| నిన్ను చూడాలని||
శాంతం ఓర్పు, సమాదానము కలిగిన నీ ముఖము చూడాలని (2)
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్య
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ (2)
|| నిన్ను చూడాలని||
నీ స్వబావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని (2)
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్య
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయ (2)