Nerpumaya Nerpumaya

నేర్పుమయా నేర్పుమయా ప్రార్ధన నేర్పుమయా

నేర్పుమయా నేర్పుమయా ప్రార్ధన నేర్పుమయా
వినుమయ్య వినుమయ్య నా ప్రార్ధన వినుమయ్య
ప్రార్ధనలో బలమును ప్రార్ధనలో శక్తిని
నేర్పుమయ్య నా నజరేయా (2)

మోషే ప్రార్ధనా మన్నాను కురుపించింది
యెహోషువ ప్రార్ధనా సూర్య చంద్రులను ఆపింది
ప్రార్ధనలో మెలకువ ప్రార్ధనలో అణకువ
నేర్పుమయ్య నా నజరేయా (2)
దానియేలు ప్రార్ధనా సింహపు నోళ్లను మూసింది
హిజకీయ ప్రార్ధనా ఆయుషును పెంచింది
ప్రార్ధనలో మహిమను ప్రార్ధనలో జయమును
నేర్పుమయ్య నా నజరేయా (2)

గెత్సమనే తోటలో ప్రార్ధనలు చేసావు
సహన గుణములెన్నో నేర్చుకున్నావు
ప్రార్ధనలో క్షమను ప్రార్ధనలో ప్రేమను
నేర్పుమయ్య నా నజరేయా (2)