Nenemaina Prabhuva

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2)

1. లేక లేక వృద్ధాప్యమందు-
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా

||నేనేమైనా||

2. సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైనా (2)
అంతము వరకు సహియించిన ఆ యోబులా

||నేనేమైనా||

3. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే-
చావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (2)
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా

||నేనేమైనా||