Neevunte Naaku Chalu Yesayya..

నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)

||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)

||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)

||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2)

||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల
సమానము (2)

||నీ మాట||