Neevu Thappa Nakevaru
నీవు తప్ప నాకెవరు లేరని
నీవు తప్ప నాకెవరు లేరని – నీవు లేక నేనుండలేనని (2)
కృపయే ఆధారం కృపయే నా ప్రాణం కృపయే నా అతిశయం (2)
1. పిచ్చుకనై నీ సన్నిధిలో ఉన్నప్పుడు – గుర్తెరుగక పోతిని నీ స్వరముని
కృపయే నను పిలిచెనే నీ తలంపులలో నను నిలిపెనే (2)
అల్పునిగా ఉన్న నన్ను బలిపీఠముపై నిలిపి
నన్ను దహించనే ఆ…ఆ …నీ రూపుతో లేపేనే (2)
||నీవు||
2. మంటినై నీ సారెపై ఉన్నప్పుడు- విరిగిపోతినే నీ చేతిలో (2)
కృపయే నన్ను చూచెనే నీ కను దృష్టిలో నన్ను నిలిపినే (2)
బలహీనమైన నన్ను ఘనమైన పాత్రగా
నన్ను రూపించనే ఆ…ఆ … నీ కొరకు బ్రతికించెనే ( 2)
||నీవు||
3. బాతుల దొడ్డిలో ఉన్నప్పుడు – హీనమైపోతినే అందరిలో
కృపయే దర్శించెనే – నీ జ్ఞాపకాలలో నను చేర్చేనే (2)
సరిగమలు తెలియని నన్ను సంగీత సింహాసనం
ఎక్కించి ఘనపరచనే ఆ…ఆ … నీ కొరకు పాడించెనే (2)